Header Banner

ట్రంప్‌ను చంపేస్తామంటూ సోషల్ మీడియాలో కలకలం.. ఒక తుపాకి కొనుగోలు - దారికి అడ్డొచ్చిన అందరినీ.!

  Sat Apr 12, 2025 10:54        U S A

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను చంపేస్తామంటూ 32 ఏళ్ల షాన్ మోన్పర్ సామాజిక మాధ్యమంలో పెట్టిన వీడియో కలకలం రేపుతోంది. ఈ వీడియో కాస్తా ఎఫ్‌బీఐ కంట్లో పడటంతో అప్రమత్తమైన అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తనను తాను మిస్టర్ సాతాన్‌గా చెప్పుకుంటున్న మోన్పర్ బట్లర్ యూట్యూబ్‌లో పలు వీడియోలు పోస్టు చేశాడు. వాటిలో ట్రంప్, ఎలాన్ మస్క్ సహా పలువురు అధికారుల పేర్లను ప్రస్తావించాడు. తన దారికి అడ్డొచ్చిన అందరినీ చంపేస్తానని ఒక వీడియోలో పేర్కొన్నాడు. మార్చి 4న పోస్టు చేసిన వీడియోలో ట్రంప్‌ను హతమార్చేది తానేనని పేర్కొన్నాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నంతో షాన్‌కు సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు. అలాగే, జనవరిలో ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందు ఒక తుపాకి కొనుగోలు చేశాడు. ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత మరిన్ని తుపాకులు, మందుగుండును కొనుగోలు చేసినట్టు అధికారులు గుర్తించారు. విచారణలో షాన్ దోషిగా తేలితే కఠిన శిక్షను ఎదుర్కోక తప్పదు.

 

ఇది కూడా చదవండి: NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాజీ ఎమ్మెల్యేకు ఊహించని షాక్.. వైసీపీ సీనియర్ నేతపై కేసు నమోదు! కారుపై దాడి..

 

పోర్ట్‌కు వేగవంతమైన రహదారి.. ఆరు లైన్ల హైవే నిర్మాణం త్వరలో! ఎన్హెచ్ఎఐ మెగా ప్లాన్!

 

నేడు (12/4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ఫూలే జయంతి వేడుకలు! మంత్రులు, నేతలు ఘన నివాళులు!

 

వైసీపీకి నిడదవోలులో చుక్కెదురు! అవిశ్వాస నాటకం నిరాకరించిన కలెక్టర్.. మిగిలింది 14 ఓట్లు మాత్రమే!

 

మాజీ మంత్రి హైకోర్టులో షాక్.. ఇక అరెస్టేనా?

 

జగన్ చేసిన వ్యాఖ్యలు కలకలం - క్షమాపణ చెప్పాలని డిమాండ్! పోలీసు సంఘం స్ట్రాంగ్ కౌంటర్!

 

రెండు తెలుగు రాష్ట్రాల‌కు పండగ లాంటి వార్త! గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు గ్రీన్ సిగ్న‌ల్‌!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #USA #AmericaNewShip #NewShip #USANews #Travel #World #BigShip #Titanic #TitanicShip #TitanicBigShip